
ముంబై: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 5–10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. జూలై 12 నుంచి కొత్త రేట్లు అమలవుతాయని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. ఏడాది వ్యవధి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) పది బేసిస్ పాయింట్లు పెరిగి 8.65% నుంచి 8.75 శాతానికి చేరింది.
ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ అయిదు బేసిస్ పాయింట్లు పెరిగి 8.45% నుంచి 8.50 శాతంగా ఉంటుంది. మూడు నెలలు, మూడేళ్ల వ్యవధి రుణాలపై వడ్డీ రేట్లు యథాతథంగా 8.35 శాతం, 8.80 శాతంగానే ఉంటాయని బ్యాంకు తెలిపింది. బేస్ రేటును 9.5 శాతం