పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా | Infosys says will investigate Panaya allegations | Sakshi
Sakshi News home page

పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా

Feb 21 2017 1:37 AM | Updated on Sep 5 2017 4:11 AM

పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా

పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా

పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విశాల్‌ సిక్కా పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  విశాల్‌ సిక్కా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు సోమవారం ఒక ఈ మెయిల్‌ పంపారు. ఆటోమేషన్‌ కంపెనీ పనయను ఇన్ఫోసిస్‌  రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసింది.

వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి ఒక లేఖ అందిన నేపథ్యంలో విశాల్‌ సిక్కా స్పందించారు. తనను బాధించడమే లక్ష్యంగా కొంతమంది  దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నారని,  కట్టుకథల ప్రచారాన్ని ఉపేక్షించబోమని  పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement