breaking news
Panaya company
-
ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అనేక సమస్యలు, విమర్శలతో చిక్కుల్లో పడిన దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట లభించింది. అమెరికా ఆధారిత సంస్థ పనయ కొనుగోలు విషయంలో నెలకొన్న వివాదంలో ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ క్లీన్ ఇచ్చింది. పనయా ఒప్పందంలో అసంబద్ధతలపై ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఆధారాలేవీ దర్యాప్తు సంస్థకు లభించలేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలిందని ఇన్ఫీ శుక్రవారం ప్రకటించింది. కాగా 2015 ఫిబ్రవరి లో, ఇన్ఫోసిస్ ఇజ్రాయిల్ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థను 200 మిలియన్ డాలర్లు లేదా రూ .1,250 కోట్లు నగదుకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి అజ్ఞాత మెయిల్ ద్వారా ఫిర్యాదులు అందాయి. అయితే పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా వివరణ ఇచ్చారు. అనంతరం గిబ్సన్ డన్ అండ్ కంట్రోల్ రిస్క్స్ ద్వారా అంతర్గత దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా
న్యూఢిల్లీ: పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సోమవారం ఒక ఈ మెయిల్ పంపారు. ఆటోమేషన్ కంపెనీ పనయను ఇన్ఫోసిస్ రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసింది. వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి ఒక లేఖ అందిన నేపథ్యంలో విశాల్ సిక్కా స్పందించారు. తనను బాధించడమే లక్ష్యంగా కొంతమంది దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నారని, కట్టుకథల ప్రచారాన్ని ఉపేక్షించబోమని పేర్కొన్నారు.