
ఈ నెల 21 నుంచీ ఇన్ఫీబీమ్ ఐపీఓ
ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఇన్‌కార్పొ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 21 నుంచి ప్రారంభ మై 23న ముగుస్తుంది.
ప్రైస్‌బాండ్ రూ.360-432
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఇన్‌కార్పొ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 21 నుంచి ప్రారంభ మై 23న ముగుస్తుంది. ఐపీఓకు వస్తున్న మొదటి ఈ కామర్స్ సంస్థ ఇది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఐపీఓకు రూ.360-432 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఇతర కంపెనీలతో ఇన్ఫీబీమ్ పోటీపడుతోంది. 2007లో ప్రారంభమైన ఇన్ఫీబీమ్ కంపెనీ ఇన్ఫీబీమ్‌డాట్‌కామ్, బిల్డ్‌బజార్, ఇన్‌సెప్ట్, పిక్‌స్క్వేర్ వంటి పలు ఈకామర్స్ సేవలను అందిస్తోంది.