ఇండిగో చరిత్రలోనే ఇది తొలిసారి : సీఈఓ

IndiGo to lay off 10pc of its workforce says CEO     - Sakshi

కరోనా సంక్షోభంలో బాధాకరమైన నిర్ణయం    

10 శాతం ఉద్యోగులకు ఉద్వాసన

సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారి ఆర్థికసంక్షోభం కారణంగా విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఉద్యోగులపై వేటు వేయనుంది. మొత్తం సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించింది. (9 కోట్ల ‌మోతాదుల వ్యాక్సిన్‌ కొనుగోలు)

ప్రస్తుత కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సంక్షోభంతో సంస్థ కార్యకలాపాల నిర్వహణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంస్థ సీఈఓ రోనోజాయ్ దత్తా సోమవారం వెల్లడించారు. లేదంటే బిజినెస్‌ నిర్వహణ అసాధ్యమని దత్తా ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాలను జాగ్రత్తగా అంచనావేసి, సమీక్షించిన తరువాత 10 శాతం ఉద్యోగుల తొలగింపు లాంటి బాధాకర నిర్ణయం తీసుక్నున్నామని చెప్పారు. ఇండిగో 250 విమానాల పూర్తి విమానంలో కొద్ది శాతం మాత్రమే నడుస్తున్నాయన్నారు. దీంతో ఇండిగో చరిత్రలో తొలిసారి ఇంత కష్టతరమైన నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.  బాధిత ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ డిసెంబర్ 2020 వరకు వర్తింపజేస్తామన్నారు. 'ప్రభావిత ఉద్యోగులకు' గ్రాస్‌ శాలరీ ఆధారంగా నోటీసు పే చెల్లిస్తామన్నారు. మార్చి 31, 2019 నాటికి, తన పేరోల్‌లో 23,531 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్టు సమాచారం.  (మౌత్‌ స్ర్పేతో నిమిషాల్లో కరోనా ఖతం)

కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో‌ దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు స్థంభించిపోయాయి. దేశీయంగా మార్చి 23 నుండి ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల నేపథ్యంలో దాదాపు మూడు నెలల తరువాత మే 25నుండి కేవలం 50-60 శాతం ఆక్యుపెన్సీ రేటుతో విమాన సేవలు తిరిగి ప్రారంభమైనాయి. అయినా డిమాండ్‌అంతంత మాత్రంగానే ఉండటంతోఆదాయాలు క్షీణించిన విమాన సంస్థలు కుదేలైనసంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top