మామూలు మందగమనం కాదు...

Indian Economy Not An Ordinary Slow Down Says By Arvind Subramanian - Sakshi

తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ: అరవింద్‌ సుబ్రహ్మణియన్‌

న్యూఢిల్లీ: దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ స్పందించారు. జాతీయ మీడియాకి ఇచ్చిన  ఒక ఇంటర్వ్యూలో  దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ గణాంకాలను విశ్లేషిస్తే దేశంలో సాధారణ మందగమనం కాకుండా తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.  2011 నుంచి 2016 సంవత్సరాలలో  దేశ వృద్ధి రేటు  2.5 శాతం పాయింట్లు ఎక్కువగా అంచనా వేయబడిందని గతంలో సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. జీడీపీనే ఆర్థిక వ్యవస్థకు కొలమానం కాదని తెలిపారు. ప్రపంచ దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థకు జీడీపీ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో గమనిస్తున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే  చమురేతర రంగాలకు దిగుమతి, ఎగుమతి రేట్లు 6 శాతం, -1శాతం ఉంటే బెటర్‌ అని సూచించారు.

మూలధన వస్తువుల వృద్ధి రేటు (10 శాతం తగ్గడం), వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి వృద్ధి రేటు (రెండేళ్ల క్రితం 5 శాతంతో పోలిస్తే ఇప్పుడు 1 శాతానికి) మెరుగైన సూచికలు కావచ్చని తెలిపారు. సూచికలు సానుకూలంగా లేక వ్యతిరేకంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి వృద్ధి, పెట్టుబడి, ఎగుమతి, దిగుమతి రంగాలు..అన్ని రంగాల లక్ష్యం ఉపాది కల్పించడమే అని తెలిపారు. సామాజిక కార్యక్రమాలకు ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందో ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల ఆదాయాలు,  వేతనాలు తగ్గడం, ఉద్యోగ కల్పనలో మందగమనం ఇవన్ని ఆర్ధిక వ్యవస్థ మందగమనానికి కొలమానంగా చెప్పవచ్చు అని తెలిపారు. అలాగే ప్రధాన సూచికలు ప్రతికూలంగా ఉన్నా జులై మాసంలో వృద్ధి రేటు కేవలం 7.7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top