Indicator
-
కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
సాఫ్ట్వేర్ రంగం అంటేనే నిరంతర మార్పులకు వేదిక. ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే వెనుకబడిపోతామన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి కొనసాగుతూ మనం నిజంగా ఎదుగుతున్నామా లేదా అని తెలుసుకోవడం ఎలా? ప్రమోషన్ వచ్చే వరకు వేచి చూడాలా? లేక మనకు మనమే ఒక గీటురాయిని నిర్ణయించుకోవాలా? దీనిపై మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన సీనియర్ ఇంజినీర్ కున్ చెన్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.ప్రమోషన్ అనేది ‘లాగింగ్ ఇండికేటర్’చాలామంది ఉద్యోగులు తమ ఎదుగుదలను ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లతో కొలుస్తారు. కానీ, కున్ చెన్ అభిప్రాయం ప్రకారం.. ప్రమోషన్ రాకపోవడం అనేది మీరు ఎదగడం లేదని చెప్పే, చాలా ఆలస్యంగా తెలిసే ఒక ‘లాగింగ్ ఇండికేటర్’ (వెనుకబడిన సూచిక) మాత్రమే. స్టీవ్ హుయిన్ నిర్వహించే ‘ఎ లైఫ్ ఇంజనీర్డ్’ పాడ్‌కాస్ట్‌లో చెన్ మాట్లాడుతూ కెరీర్ స్తబ్దతను గుర్తించడానికి ప్రమోషన్ల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఆ ఒక్క ప్రశ్నతో కెరీర్ అంచనా!తన కెరీర్ ప్రారంభం నుంచి కున్ చెన్ ‘గత నెలలో నేను చేయలేని పనిని, ఈ నెలలో కొత్తగా ఏం చేయగలుగుతున్నాను?’ అనే సరళమైన, అత్యంత శక్తివంతమైన ప్రశ్న తనకు తాను వేసుకునేవారట. ఈ ప్రశ్నకు వరుసగా కొన్ని నెలల పాటు సమాధానం దొరకకపోతే మీరు నేర్చుకునే ప్రక్రియ ఆగిపోయిందని అర్థం. మైక్రోసాఫ్ట్‌లో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తన పని పునరావృతం అవుతోందని, కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదని ఈ పరీక్ష ద్వారానే ఆయన గ్రహించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.రాజీనామానే మార్గమా?నేర్చుకోవడం ఆగిపోయిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెన్ సూచిస్తున్నారు. కంపెనీని వీడకముందే కొన్ని అంతర్గత మార్గాలను అన్వేషించాలని ఆయన సలహా ఇచ్చారు. మేనేజర్లతో చర్చించి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. కంపెనీలోనే ఎక్కువ లెర్నింగ్ స్కోప్ ఉన్న మరో టీమ్‌కు బదిలీ అవ్వొచ్చన్నారు. చెన్ కూడా మైక్రోసాఫ్ట్ లో అంతర్గత మార్పును ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పట్లో వేగంగా ఎదుగుతున్న ‘ఫేస్బుక్’ (మెటా) వైపు వెళ్లడమే సరైనదని భావించారు. వేగవంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుందని ఆయన నమ్మినట్లు చెప్పారు.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు నిరంతరం తమను తాము ప్రశ్నించుకోవాలని చెన్ హెచ్చరిస్తున్నారు. ప్రతి నెల మనలో కొత్త నైపుణ్యం తోడవ్వకపోతే ఈ వేగవంతమైన పరిశ్రమలో మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి, ప్రమోషన్ల కోసం ఎదురుచూడకుండా మీరు ఏమేరకు కొత్త అంశాలు నేర్చుకుంటున్నారో ప్రతి నెలా చెక్ చేసుకోండి!ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
మామూలు మందగమనం కాదు...
న్యూఢిల్లీ: దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ స్పందించారు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గణాంకాలను విశ్లేషిస్తే దేశంలో సాధారణ మందగమనం కాకుండా తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 2011 నుంచి 2016 సంవత్సరాలలో దేశ వృద్ధి రేటు 2.5 శాతం పాయింట్లు ఎక్కువగా అంచనా వేయబడిందని గతంలో సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. జీడీపీనే ఆర్థిక వ్యవస్థకు కొలమానం కాదని తెలిపారు. ప్రపంచ దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థకు జీడీపీ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో గమనిస్తున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే చమురేతర రంగాలకు దిగుమతి, ఎగుమతి రేట్లు 6 శాతం, -1శాతం ఉంటే బెటర్ అని సూచించారు. మూలధన వస్తువుల వృద్ధి రేటు (10 శాతం తగ్గడం), వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి వృద్ధి రేటు (రెండేళ్ల క్రితం 5 శాతంతో పోలిస్తే ఇప్పుడు 1 శాతానికి) మెరుగైన సూచికలు కావచ్చని తెలిపారు. సూచికలు సానుకూలంగా లేక వ్యతిరేకంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి వృద్ధి, పెట్టుబడి, ఎగుమతి, దిగుమతి రంగాలు..అన్ని రంగాల లక్ష్యం ఉపాది కల్పించడమే అని తెలిపారు. సామాజిక కార్యక్రమాలకు ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందో ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల ఆదాయాలు, వేతనాలు తగ్గడం, ఉద్యోగ కల్పనలో మందగమనం ఇవన్ని ఆర్ధిక వ్యవస్థ మందగమనానికి కొలమానంగా చెప్పవచ్చు అని తెలిపారు. అలాగే ప్రధాన సూచికలు ప్రతికూలంగా ఉన్నా జులై మాసంలో వృద్ధి రేటు కేవలం 7.7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు
మహబూబ్‌నగర్: ఇండికేటర్ వేయకుండా.. యూటర్న్ తీసుకుంటున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యా భర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామ బస్టాప్‌వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, అతని భార్య అనుషలు సోమవారం షాద్‌నగర్ నుంచి తమ షిఫ్ట్ కారులో వస్తుండగా రంగారెడ్డిగూడ గ్రామ బస్టాప్ వద్ద ముందు ఓ లారీ ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండ యూటర్న్ తీసుకుంటుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డిజిల్ట్యాంక్ వద్ద కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న శ్రీకాంత్‌రెడ్డి, అనుషాలకు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రై వర్ మన్సూర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఐ అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్ ట్రిడెంట్ ఆస్పత్రికి తరలించారు. భార్య భర్తల పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.


