ఇండికేటర్ వేయకుండా.. యూటర్న్ తీసుకుంటున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యా భర్తలకు తీవ్రగాయాలయ్యాయి.
మహబూబ్‌నగర్: ఇండికేటర్ వేయకుండా.. యూటర్న్ తీసుకుంటున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యా భర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామ బస్టాప్‌వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, అతని భార్య అనుషలు సోమవారం షాద్‌నగర్ నుంచి తమ షిఫ్ట్ కారులో వస్తుండగా రంగారెడ్డిగూడ గ్రామ బస్టాప్ వద్ద ముందు ఓ లారీ ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండ యూటర్న్ తీసుకుంటుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో లారీ డిజిల్‌ట్యాంక్ వద్ద కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న శ్రీకాంత్‌రెడ్డి, అనుషాలకు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రై వర్ మన్సూర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్ ట్రిడెంట్ ఆస్పత్రికి తరలించారు. భార్య భర్తల పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.