‘స్థిరం’గానే ఆర్థిక వ్యవస్థ..

‘స్థిరం’గానే ఆర్థిక వ్యవస్థ.. - Sakshi


భారతఖ రేటింగ్ అవుటఖలుక్‌పై ఫిచ్

‘బీబీబీ-’ గ్రేడ్ కొనసాగింపు...

‘జంక్’ స్థాయికి ఒకమెట్టే ఎక్కువ

2015-16లో వృద్ధి రేటు 7.5%గా అంచనాన్యూఢిల్లీ:
భారతఖ ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌కు సంబంధించి తమ ‘అవుటఖలుక్’ యథాతథమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించింది. భారతఖకు ఇప్చడున్న ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగించింది. అవుటఖలుక్‌ను ‘స్థిరం’గానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుత రేటింగ్ పెట్టుబడులకు సంబంధించి అత్యంత కనిష్ట స్థాయిది కావడం గమనార్హం. జంక్ (చెత్త) హోదాకు ‘బీబీబీ-’ ఒక మెట్టు ఎక్కువ.  అనుకూల-ప్రతికూల అంశాలు రెండూ సమతౌల్యంగా ఉన్నట్లు ఈ అవుటఖలుక్ సూచిస్తుంది. మధ్య కాలికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి పటిష్టత, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, కరెంటఖ అకౌంటఖ లోటు (?ఫఐఐ,?ఫడీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీపోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిధుల మధ్య వ్యత్యాసం) తగిన స్థాయిల్లో ఉండడం సానుకూలతలుగా పేర్కొంది. ప్రభుత్వ అధిక రుణ భారాలు, ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ- వ్యయాల మధ్య వ్యత్యాసం), అననుకూల వ్యాపార పరిస్థితులు వంటి బలహీన వ్యవస్థీకృత అంశాలు సవాళ్లుగా వివరించింది. అయితే ఇదే సమయంలో వ్యాపార పరిస్థితులకు సంబంధించి వాతావరణం మెరుగుపడుతున్నటూ ఫిచఖ పేర్కొనడం విశేషం. భారతఖ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజా ఫిచఖ రేటింగ్స్ ప్రకటనలో ముఖ్యాంశాలు...ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతఖ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనా 7.5%. 2016-17లో ఈ రేటు 8 %కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, వ్యవస్థీకృత సంస్కరణల ఎజెండాను క్రమంగా అమలుచేయడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. గడచిన ఆర్థిక సంవత్సరం భారతఖ వృద్ధి రేటు 7.3%.భారతఖ  జీడీపీ వృద్ధి అవుటఖలుక్ పటిష్టంగా కనిపిస్తోంది. 2015లో రిజర్వ్ బ్యాంక్ ?ఫ ఇండియా 1.25 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం) కోత కూడా జీడీపీ వృద్ధి రేటు బలోపేతానికి దోహదపడుతున్న అంశం. రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ పూర్తిగా వినియోగదారుకు బదలాయించనప్పటికీ వృద్ధి పటిష్టత విషయంలో ప్రతికూలత ఏదీ లేదు. 1.25 శాతం రెపో కోతలో 0.60 శాతం ప్రయోజనాన్ని మాత్రమే బ్యాంకింగ్ రుణ గ్రహీతకు బదలాయించింది.బ్యాంకింగ్‌లో 2015-16లో మొండి బకాయిల భారం 4.9 %కి చేరే అవకాశం ఉంది. 2018-19కల్లా బాసెలఖ 3 నిబంధనలకు అనుగుణంగా కొత్త మూలధనం కల్పన అంశంలో... బ్యాంకింగ్ అంతర్గత నిధుల సమీకరణకు ఇది ఇబ్బందికరమైన అంశం.ప్రభుత్వ రుణ భారాలు తగ్గడం, ఆర్థిక సంస్కరణల ద్వారా మెరుగుపడిన వాణిజ్య వాతావరణ పరిస్థితులు, అధిక వృద్ధి రేటు, పెట్టుబడులు, పూర్తి అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు మున్ముందు రేటింగ్ మరింత మెరుగుదలకు దోహదపడే అంశాలు.అయితే ద్రవ్యలోటు లక్ష్యం దారితప్పడం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల భారం పెరగడం, అధిక ద్రవ్యోల్బణం, కరెంటఖ అకౌంటఖ లోటు కట్టుతప్పడం ప్రతికూల రేటింగ్ చర్యలకు దారితీస్తాయి.

సంస్కరణల వల్ల వ్యాపార సానుకూల పరిస్థితులు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మౌలికరంగంలో ఇబ్బందులు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఒక్క రాత్రిలో పరిష్కారమయిపోవన్నది గుర్తించాలి.ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలు ద్రవ్యలోటు లక్ష్య (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 3.9 శాతం)  సాధన అవకాశాలపై అనుమానాలు సృష్టిస్తోంది. అదనపు ఆదాయం సమకూరనిదే ద్రవ్యలోటు లక్ష్య సాధన కష్టంగా కనబడుతోంది.  కేంద్రం, రా?ాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతం ఉండే అవకాశం ఉంది. ‘బీబీబీ’ రేటింగ్ ఉన్న దేశాల సగటు 2.8 శాతంకన్నా ఇది అధికం.  విద్యుతఖ పంపిణీ కంపెనీల ఆర్థికభారం ప్రధానంగా రా? ప్రభుత్వాలపై పడుతోంది.2014-15లో ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 66.8 శాతం ఉంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 68.8 శాతానికి ఎగసే పరిస్థితి ఉంది. ‘బీబీబీ-’ శ్రేణి దేశాలకు సంబంధించి అధిక ప్రభుత్వ రుణ భారం ఉన్న దేశాల్లో భారతఖ ఒకటి.

వస్తు సేవల పన్నుసహా పెద్ద సంస్కరణల అమలులో రాజ్యసభలో మద్దతు పొందడం ప్రభుత్వానికి కీలక అంశం. ఏకాభిప్రాయ సాధన సంస్కరణల అమలులో ముఖ్యమైనది.అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు దిగువ స్థాయిలో ఉండడం దేశానికి లాభిస్తున్న అంశం. 2015-2016లో సగటున బేరలఖ ధర 55 డాలర్లు ఉంటుంది. 2017లో ఇది 65 డాలర్లకు పెరిగే వీలుంది.

రాజకీయ ఇబ్బందులు, సామాజిక అనిశ్చితి, ప్రత్యేక ఉద్యమాలు, తీవ్రవాదం, నక్సలైట్ల వంటి తిరుగుబాటు కార్యకలాపాల వల్ల ఆర్థిక క్రియాశీలతకు తీవ్ర విఘాతం ఏదీ కలగదు.ఏమిటీ రేటింగ్స్..?

విదేశీ ఇన్వెస్టర్లు, ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడానికి తరచూ ఫిచఖ, ?సఅండ్‌పీ, మూడీ?స వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల ‘రేటింగ్స్’ను పరిగణనలోకి తీసుకుంటాయి. ?సఅండ్‌పీ రేటింగ్ కూడా భారతఖకు సంబంధించి ‘బీబీబీ-’స్టేబులఖగా ఉంది.  పాజిటివఖ అవుటఖలుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్‌ను మూడీ?స ఇస్తోంది.


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top