బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితి పెంపు రెట్టింపు?

Increasing The Basic Tax Exemption Limit to Rs 5 lakh Can Cheer Retail Investors - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో కేంద్ర ఆర్థికబడ్జెట్‌  పార్లమెంటు ముందుకు రానుంది. ఎన్నికల ముందు బీజేపీ సర్కార్‌ తీసుకొస్తున్న మధ్యంతర బడ్జెట్పై  వివిధ అంచనాలు నెలకొన్నాయి.  ముఖ్యంగా వేతన జీవులకు ఊరట లభించనుందనే మాట వినిపిస్తోంది. రేపు( ఫిబ్రవరి 1)న ప్రకటించనున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రధాన సంస్కరణలను ప్రకటించకపోయినా, మరింత జనాకర్షితంగా ఉండవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.ఆదాయపు పన్ను పరిమితిలో  భారీ పెంపు ఉంటుందని భాస్తున్నారు. ఈ మినహాయింపును దాదాపు  రెట్టింపు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలుగా ఉంది. అయితే  పరితిమిని  రూ. 5లక్షలకు పెంచ వచ్చని అంచనా. ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు మాత్రమే రూ.5 లక్షల మినహాయింపు ఉంది.   

మరోవైపు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఇప్పటికే డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక, సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల మేరకు పెంచాలని సిఐఐ కోరింది. అంచనాలకనుగుణంగా ఈ పరిమితి రెట్టింపు అయితే రిటైల్ పెట్టుబడిదారులను ఉత్సాహపరుస్తుందని మార్కెట్‌ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top