ఐకియా బంపర్‌ ఆఫర్‌ 

 IKEA Locations Across Canada Are Hosting Massive House Parties This Month - Sakshi

ఐకియా షాపింగ్‌  అనుభవాలు, ఫోటోలతో  కస్టమర్ల కథనాలు

టాప్‌ -20 కథనాలపై ఓటింగ్

ఎంపిక చేసిన  కుటుంబాలకు  స్వీడన్‌  టూర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా   వార్షికోత్సవం సందర్భంగా  తన కస్టమర్లకు  గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ​  ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుని స్టోర్‌లో కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మెంబర్‌షిప్‌ కార్డు తీసుకుని ఆపై తమ అనుభూతులను, ఫోటోలతో సహా ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుండి టాప్‌ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో ఓటింగ్‌ పెడతామని, సెప్టెంబర్‌ 9 నుండి 20వ తేదీ వరకు సాగే ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన కుటుంబాలను స్వీడన్‌లోని (6 డేస్‌,  5 నైట్స్‌) వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తామని ఐకియా ప్రకటన పేర్కొంది. తెలంగాణా వాసులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top