హ్యుందాయ్ ఇయాన్.. కొత్త వేరియంట్

హ్యుందాయ్ ఇయాన్.. కొత్త వేరియంట్


న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన ఎంట్రీలెవెల్ చిన్న కారు ‘ఇయాన్’లో కొత్త వేరియంట్‌ను మంగళవారం ఇక్కడ ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.3.83 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. 1 లీటర్ కప్పా ఇంజిన్(ఇయాన్ మాగ్నా ప్లస్)తో పాటు ఇప్పుడున్న 0.8 లీటర్ ఇంజిన్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈఓ బీఎస్ సియో చెప్పారు. ఈ కొత్త వేరియంట్ అధిక ఇంజిన్ సామర్థ్యం, తక్కువ కాలుష్యం, మరింత మెరుగైన మైలేజీని అంది స్తుందన్నారు. కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా తమ కార్లలో వినూత్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు చేర్చుతున్నామని, దీని ద్వారా దేశీ మార్కెట్లో తమ వాటా మరింత సుస్థిరం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top