హువావే నుంచి..‘పీ9’ స్మార్ట్ఫోన్ | Huawei P9 launched in India for $597 | Sakshi
Sakshi News home page

హువావే నుంచి..‘పీ9’ స్మార్ట్ఫోన్

Aug 18 2016 1:21 AM | Updated on Nov 6 2018 5:26 PM

హువావే నుంచి..‘పీ9’ స్మార్ట్ఫోన్ - Sakshi

హువావే నుంచి..‘పీ9’ స్మార్ట్ఫోన్

ప్రపంచపు మూడో అతిపెద్ద మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ‘పీ9’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: ప్రపంచపు మూడో అతిపెద్ద మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ‘పీ9’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.39,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో నాణ్యమైన సిగ్నల్స్ కోసం మూడు యాంటినాలను పొందుపరిచామని, దీని వల్ల కాల్ డ్రాప్స్ తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. ఇక ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.2 అంగుళాల స్క్రీన్, 4జీ, డ్యూయెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, డ్యూయెల్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్లను ఆన్‌లైన్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కాగా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ‘మెట్‌బుక్’, ‘టాల్క్‌బాండ్ బీ3’ అనే రెండు ట్యాబ్లెట్ పీసీలను కూడా ఆవి ష్కరించింది. ఇవి త్వరలో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement