త్రిపుల్‌ బ్యాక్‌ కెమెరాతో తొలి స్మార్ట్‌ఫోన్‌

Huawei P20 And P20 Pro Smartphones Coming To India Soon - Sakshi

న్యూఢిల్లీ : భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటి వరకు డ్యూయల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్లు మాత్రమే మనల్ని అలరించగా... ఇక నుంచి త్రిపుల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కూడా మన ముందుకు రాబోతోంది. ప్రపంచపు తొలి త్రిపుల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి హువావే సిద్ధమవుతోంది. 

హువావే పీ20, హువావే పీ20 ప్రొ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను హువావే భారత్‌లో లాంచ్‌ చేయబోతోంది. దీనికి సంబంధించి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇమేజ్‌ను టీజ్‌ కూడా చేసింది. ‘కమింగ్‌ సూన్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌లైన్‌తో కంపెనీ దీన్ని పోస్టు చేసింది. దీనిలో పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఉండబోతోంది. త్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఒకటి 40 ఎంపీ, మరొకటి 20 ఎంపీ, మూడోది 8 ఎంపీ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్లో మోషన్‌ వీడియోను 720పీ రెజుల్యూషన్‌లో 960ఎఫ్‌పీఎస్‌ వద్ద రికార్డు చేస్తోంది. 

హువావే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను మార్చి 27న పారిస్‌లో లాంచ్‌ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియోను, కంపెనీ సొంత కిరిన్‌ 970 ప్రాసెసర్‌ను, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను, 24 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉన్నాయి. హువావే పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. డ్యూయల్‌  సిమ్‌ కార్డులను కూడా కలిగి ఉంది. పీ20 స్మార్ట్‌ఫోన్‌ 5.8 అంగుళాల స్క్రీన్‌ కలిగి ఉండి, 20 ఎంపీ, 12 ఎంపీ సెటప్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో  మార్కెట్లోకి వస్తోంది. దీని బ్యాటరీ 3400 ఎంఏహెచ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

హువావే పీ20 ప్రొ అంచనా ధర
హువావే పీ20 ప్రొ అత్యధిక ధర 899 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.72000 ఉండొచ్చని అంచనా. ఈ ప్రొ వేరియంట్‌తోనే హువావే తొలిసారి రూ.70వేల ధర మార్కును క్రాస్‌చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top