హువావే హాలిడే సేల్‌ : రూ.15వేల డిస్కౌంట్‌ | Huawei Holiday sale on Amazon: Get up to Rs 15k discount   | Sakshi
Sakshi News home page

హువావే హాలిడే సేల్‌ : రూ.15వేల డిస్కౌంట్‌

Dec 28 2018 8:40 PM | Updated on Dec 28 2018 8:47 PM

Huawei Holiday sale on Amazon: Get up to Rs 15k discount   - Sakshi

హువావే తన స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్లపై 15వేల రూపాయల దాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. హువావే హాలిడే  సేల్‌ను అమెజాన్‌ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌,  క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్‌. అలాగే నో కాస్ట్‌ ఈఎంఐ సదపాయం కూడా ఉంది.  హువావే  పీ20లైట్‌, పీ 20ప్రొ నోవా 3ఐ, నోవా 3స్మార్ట్‌ఫోన్లపై ఈ భారీ డిస్కౌంట్లను హువావే ప్రకటించింది. 

భారీ ఆఫర్లివే..

హువావే పీ 20 ప్రొ : ఈ స్మార్ట్‌ఫోన్‌పై 15వేల రూపాయల భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.   హాలిడే సేల్‌ లో  ఈ స్మార్ట్‌ఫోన్‌​ రూ. 54,999లకే లభ్యం.  
ఫీచర్లు: 6.1 అంగుళాల డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, 40+24+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

హువావే పీ 20లైట్‌: రూ. 8వేల డిస్కౌంట్‌ అనంతరం ఇపుడు రూ.14,999 లకే లభ్యం 
ఫీచర్లు: 5.84 అంగుళాల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌,64జీబీ స్టోరేజ్‌, 24+16ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీకెమెరా, 3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ

నోవా 3ఐ: రూ.7వేల డిస్కౌంట్‌తో రూ. 16,990 లకే అందుబాటులో ఉంది. 
ఫీచర్లు: 6.3 అంగుళాల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌,16+2ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్‌ రిసెల్ఫీ కెమెరా, 3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ

నోవా 3 : 10వేల రూపాయల  తగ్గింపు అనంతరం ప్రస్తుతం రూ. 29,999లకే విక్రయిస్తోంది.
ఫీచర్లు: 6.3 అంగుళాల డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, 24+16ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్‌  సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement