చౌకైన నోకియా ఫోన్‌ వచ్చేసింది.. | HMD Global unveils Nokia 2 in a global event from India | Sakshi
Sakshi News home page

చౌకైన నోకియా ఫోన్‌ వచ్చేసింది..

Oct 31 2017 1:25 PM | Updated on Oct 31 2017 1:41 PM

HMD Global unveils Nokia 2 in a global event from India

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ వేదికగా తన చౌకైన నోకియా స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌  అంతర్జాతీయంగా విడుదల చేసింది. ఢిల్లీ వేదికగా నోకియా 2 స్మార్ట్‌ఫోన్‌ను  మంగళవారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 99 యూరోలుగా కంపెనీ పేర్కొంది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 7,500 రూపాయలు. నవంబర్‌ మధ్య నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభమవుతాయని లాంచ్‌ ఈవెంట్‌లో కంపెనీ తెలిపింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇప్పటి వరకు విడుదల చేసిన నోకియా బ్రాండు స్మార్ట్‌ఫోన్లలో ఇదే చాలా చౌక. ఈ ఫోన్‌ ప్రత్యేకత 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ. రెండు రోజులు వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉండనుంది. షావోమి రెడ్‌మి 4ఏ, మోటో సీ స్మార్ట్‌ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.  

నోకియా 2 ఫీచర్లు..5 అంగుళాల ఎల్‌టీపీఎస్‌ హెచ్‌డీ స్క్రీన్‌, గొర్రిల్లా గ్లాస్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 212 ప్రాసెసర్‌
1 జీబీ ర్యామ్‌
8 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ ఫోన్‌
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌, త్వరలోనే ఓరియో అప్‌డేట్‌
కాపర్‌ బ్లాక్‌, క్లియర్‌ బ్లాక్‌, క్లియర్‌ వైట్‌ రంగుల్లో ఇది అందుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement