హీరో వాహనాలు మరింత ప్రియం | Sakshi
Sakshi News home page

హీరో వాహనాలు మరింత ప్రియం

Published Thu, Sep 27 2018 1:02 AM

Hero MotoCorp to raise prices of bikes and scooters from next month - Sakshi

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ తమ వాహనాల రేట్లను రూ. 900 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి మారకం పతనం ప్రభావాలను ఎదుర్కొనేందుకు రేట్లను పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది.

మోడల్, మార్కెట్‌ను బట్టి రేట్ల పెంపు రూ. 900 దాకా ఉంటుందని వివరించింది. కంపెనీ గత నెలలో కూడా రూ. 500 దాకా రేట్లను పెంచింది. హీరో మోటోకార్ప్‌ ప్రస్తుతం రూ. 40,000 నుంచి రూ. 1 లక్ష దాకా ఖరీదు చేసే స్కూటర్స్, బైక్‌లను విక్రయిస్తోంది. బుధవారం హీరో మోటోకార్ప్‌ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 3,104.50 వద్ద ముగిసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement