రూ.24,000 కోట్లు సమీకరించనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  | HDFC Bank to raise Rs 24,000 crore | Sakshi
Sakshi News home page

 రూ.24,000 కోట్లు సమీకరించనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 

Dec 21 2017 12:21 AM | Updated on Dec 21 2017 12:21 AM

HDFC Bank to raise Rs 24,000 crore - Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.24,000 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధుల సమీకరణకు గాను బుధవారం జరిగిన బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీకి ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ చేయడం ద్వారా రూ.8,500 కోట్లు సమీకరిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది.

మిగిలిన రూ.15,500 కోట్లను షేర్ల జారీ లేదా కన్వర్టబుల్‌ సెక్యూరిటీలు, క్యూఐపీ, ఏడీఆర్‌/జీడీఆర్‌ల ద్వారా సమీకస్తామని వివరించింది. వచ్చే నెల 19న జరిగే అసాధారణ సర్వసభ్య  సమావేశంలో ఈ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరతామని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement