వచ్చే ఏడాదికి 15వేల ఐటీ ఉద్యోగాలు | HCL Technologies to double hiring to 15000 in FY21 | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదికి 15వేల ఐటీ ఉద్యోగాలు

Jan 25 2020 6:15 PM | Updated on Jan 25 2020 6:15 PM

HCL Technologies to double hiring to 15000 in FY21 - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఐటీ ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నోయిడాకి చెందిన ఐటి సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 2021 ఆర్థిక సంవత్సరంలో తన నియామకాలను  రెట్టింపు చేయాలని భావిస్తోంది. రానున్న కాలంలో రెట్టింపు సంఖ్యలో దాదాపు 15 వేల ఉద్యోగాలను కల్పించనున్నామని కంపెనీ హెచ్‌ఆర్‌ ముఖ్య అధికారి వీవీ అప్పారావుతెలిపారు. అంతేకాదు గతం కంటే మెరుగైన ప్యాకేజీ ఇవ్వనున్నామని చెప్పారు. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. గతేడాది ఈ సంఖ్య కేవలం 8,600 మాత్రమే కావటం గమనార్హం.  అటు ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, మానేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనుంది. మొత్తం 15,000 ఫ్రెషర్స్ లో ఒక 500 మందిని టాప్ బిజినెస్ స్కూల్స్ నుంచి నియమించుకోనుంది.  ఆన్‌లైన్ జాబ్ సెర్చ్ పోర్టల్ అయిన గ్లాస్‌డోర్‌ అందించిన  సమాచారం ప్రకారం  తాజా నియామకాలకు, వార్షిక పే ప్యాకేజీ రూ .3.5 లక్షల నుండి రూ .3.8 లక్షల మధ్య ఉంటుంది. మరోవైపు మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు కంపెనీ గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ స్థాయి వారికి రూ.13 లక్షల నుండి రూ. 17 లక్షల వరకు ఉండనున్నాయి. 12వ తరగతి తర్వాత విద్యార్థులను కూడా నియమించుకుంటుంది. దీని కోసం, హెచ్‌సీఎల్‌ టీఎస్ఎస్ (హెచ్‌సీఎల్ ట్రైనింగ్ & స్టాఫింగ్ సర్వీసెస్),  తద్వారా  నైపుణ్యాలు లేకపోవడం వల్ల పూరించడం కష్టంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల మధ్య చాలా అవసరమైన అంతరాన్ని తగ్గించాలని భావిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement