భారత్‌లో గూగుల్‌ నియామకాలు | Google to add over 3,800 customer support jobs in US, India | Sakshi
Sakshi News home page

భారత్‌లో గూగుల్‌ నియామకాలు

Dec 21 2019 5:38 AM | Updated on Dec 21 2019 5:38 AM

Google to add over 3,800 customer support jobs in US, India - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌.. ప్రపంచ వ్యాప్తంగా 3,800 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. భారత్, అమెరికా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో ఈ నియామకాలు జరగనున్నాయని సంస్థ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్, యూజర్‌ సపోర్ట్‌ ఉద్యోగాల్లో నేరుగా కంపెనీ ఉద్యోగాలు ఉండనున్నాయని వివరించింది. గతంలో థర్డ్‌పార్టీ సేవల ద్వారా ఈ నియామకాలు జరిగేవి. ప్రస్తుతం కస్టమర్‌ సపోర్ట్‌ విభాగంలో కంపెనీకి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారని 2020 చివరినాటికి వీరి సంఖ్యను 4,800 మందికి పెంచనున్నామని ఆపరేషన్స్‌ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రాయ్‌ డికెర్సన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement