తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త | good news for telangana govt employers | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Mar 14 2015 1:53 AM | Updated on Sep 2 2017 10:47 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూకట్‌పల్లిలోని పాజిటివ్ డెంటల్ బ్రాంచ్‌లో ప్రభుత్వ నగదు రహిత వైద్య సేవలు లభించనున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూకట్‌పల్లిలోని పాజిటివ్ డెంటల్ బ్రాంచ్‌లో ప్రభుత్వ నగదు రహిత వైద్య సేవలు లభించనున్నాయి. కూకట్‌పల్లి బ్రాంచ్‌కు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ గుర్తింపు దక్కిందని పాజిటివ్ హోమియోపతి ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఈ బ్రాంచ్‌లో నగదు రహిత వైద్య సేవలను పొందవచ్చని పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక వరం లాంటిదని, పాజిటివ్ డెంటల్ వారు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని నాణ్యమైన ఆరోగ్య సేవలను ఉద్యోగులకు అందించాలని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన దిల్‌షుఖ్‌నగర్‌లో పాజిటివ్ ఇంప్లాట్స్ అనే ప్రత్యేక దంత విభాగంతో కూడిన పాజిటివ్ అలోపతి బ్రాంచ్‌ని కొత్తగా ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement