 
													సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు 1,031 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు.
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు కాగా.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్‌బీ శాఖలో 46,956 బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
