సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ లేకపోతే అక్టోబర్ నెల జీతం నిలిపివేయనున్నట్లు సృష్టం చేసింది. అన్ని శాఖాధిపతులు, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం.. IFMIS పోర్టల్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలని పేర్కొంది.
రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ఒకే నిబంధన విధించిన ప్రభుత్వం.. అక్టోబర్ 25 రాత్రి 12 గంటల లోపు డేటా అప్‌డేట్ చేయాలని తెలిపింది. ఆధార్ లింక్ లేని ఉద్యోగుల జీతం నిలిపివేత తప్పదని.. నియమాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయంటూ ప్రభుత్వం హెచ్చరించింది.


