వంట నూనెల మార్కెట్లోకి ‘గోల్డీవియా’.. | Goldiva entry's new oil market company's | Sakshi
Sakshi News home page

వంట నూనెల మార్కెట్లోకి ‘గోల్డీవియా’..

Apr 14 2016 12:48 AM | Updated on Sep 3 2017 9:51 PM

వంట నూనెల మార్కెట్లోకి ‘గోల్డీవియా’..

వంట నూనెల మార్కెట్లోకి ‘గోల్డీవియా’..

దేశీయ వంట నూనెల మార్కెట్లో మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది. ఇండోనేసియాకు చెందిన ముసిమ్ మస్ అనుబంధ కంపెనీ..

విస్తరణలో సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వంట నూనెల మార్కెట్లో మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది. ఇండోనేసియాకు చెందిన ముసిమ్ మస్ అనుబంధ కంపెనీ సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్, ఫ్యాట్స్ (సికాఫ్) గోల్డీవియా బ్రాండ్‌తో సన్‌ఫ్లవర్ నూనెను బుధవారమిక్కడ ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పటికే సూర్య గోల్డ్ పేరుతో 17 రాష్ట్రాల్లో సన్‌ఫ్లవర్ నూనెతోపాటు ఇతర బ్రాండ్లలో వంట నూనెలు, ఫ్యాట్స్‌ను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా నెలకు 18 లక్షల టన్నుల పొద్దు తిరుగుడు నూనె అమ్ముడవుతోంది. ఇందులో మహారాష్ట్రతోపాటు దక్షిణాది రాష్ట్రాలు 60 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. ఈ స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో విస్తరణలో భాగంగా కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చామని సికాఫ్ ఇండియా హెడ్ పి.సుబ్రమణియం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్యాకేజ్డ్ వంట నూనెల మార్కెట్లో సికాఫ్‌కు 10-15 శాతం వాటా ఉందన్నారు.

 మరిన్ని పెట్టుబడులు..
కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల టర్నోవర్ సాధించింది. రెండేళ్లలో రూ.2,240 కోట్ల లక్ష్యాన్ని విధించుకున్నట్టు సికాఫ్ కమాడిటీస్ మేనేజర్ పి.శారద తెలిపారు. కొద్ది రోజుల్లో రైస్ బ్రాన్ ఆయిల్  విభాగంలోకి ప్రవేశిస్తామని చెప్పారు. 70 దేశాల్లో తమ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ముసిమ్ మస్ ప్రతినిధి యుప్ యూన్ జీ వెల్లడించారు. ఇక్కడి కంపెనీల కొనుగోళ్లకు, కొత్త రిఫైనరీల ఏర్పాటుకు సిద్ధమేనని పేర్కొన్నారు. చైనా, భారత్‌లపై భారీ ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో నెలకు 700 టన్నుల నూనె విక్రయిస్తోంది. ఇది 3 వేల టన్నుల స్థాయికి చేరితే కాండ్లా ప్రాంతంలో రిఫైనరీ నెలకొల్పుతామని సుబ్రమణియం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement