breaking news
South India krishna oil
-
వంట నూనెల మార్కెట్లోకి ‘గోల్డీవియా’..
విస్తరణలో సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వంట నూనెల మార్కెట్లో మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది. ఇండోనేసియాకు చెందిన ముసిమ్ మస్ అనుబంధ కంపెనీ సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్, ఫ్యాట్స్ (సికాఫ్) గోల్డీవియా బ్రాండ్‌తో సన్‌ఫ్లవర్ నూనెను బుధవారమిక్కడ ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పటికే సూర్య గోల్డ్ పేరుతో 17 రాష్ట్రాల్లో సన్‌ఫ్లవర్ నూనెతోపాటు ఇతర బ్రాండ్లలో వంట నూనెలు, ఫ్యాట్స్‌ను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా నెలకు 18 లక్షల టన్నుల పొద్దు తిరుగుడు నూనె అమ్ముడవుతోంది. ఇందులో మహారాష్ట్రతోపాటు దక్షిణాది రాష్ట్రాలు 60 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. ఈ స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో విస్తరణలో భాగంగా కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చామని సికాఫ్ ఇండియా హెడ్ పి.సుబ్రమణియం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్యాకేజ్డ్ వంట నూనెల మార్కెట్లో సికాఫ్‌కు 10-15 శాతం వాటా ఉందన్నారు. మరిన్ని పెట్టుబడులు.. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల టర్నోవర్ సాధించింది. రెండేళ్లలో రూ.2,240 కోట్ల లక్ష్యాన్ని విధించుకున్నట్టు సికాఫ్ కమాడిటీస్ మేనేజర్ పి.శారద తెలిపారు. కొద్ది రోజుల్లో రైస్ బ్రాన్ ఆయిల్ విభాగంలోకి ప్రవేశిస్తామని చెప్పారు. 70 దేశాల్లో తమ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ముసిమ్ మస్ ప్రతినిధి యుప్ యూన్ జీ వెల్లడించారు. ఇక్కడి కంపెనీల కొనుగోళ్లకు, కొత్త రిఫైనరీల ఏర్పాటుకు సిద్ధమేనని పేర్కొన్నారు. చైనా, భారత్‌లపై భారీ ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో నెలకు 700 టన్నుల నూనె విక్రయిస్తోంది. ఇది 3 వేల టన్నుల స్థాయికి చేరితే కాండ్లా ప్రాంతంలో రిఫైనరీ నెలకొల్పుతామని సుబ్రమణియం వెల్లడించారు. -
లక్ష్యం రూ.1,200 కోట్లు
సికాఫ్ జీఎం సుబ్రమణియమ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల తయారీలో ఉన్న సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్, ఫ్యాట్స్ (సికాఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2013-14లో రూ.1,000 కోట్లకుపైగా ఆర్జించామని సికాఫ్ జీఎం సుబ్రమణియమ్ పలనిసామి తెలిపారు. సూర్యగోల్డ్ బ్రాండ్‌లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా కంపెనీ ప్రతినిధులు శారద తదితరులతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏటా విక్రయిస్తున్న 2 లక్షల టన్నుల్లో 30 శాతం ప్యాకేజ్డ్ ఆయిల్ కైవసం చేసుకుందన్నారు. 2-3 ఏళ్లలో ప్యాకింగ్ నూనెల విక్రయాలను రెండింతలు చేస్తామన్నారు. ‘రోజుకు 1,200 టన్నుల నూనె ప్రాసెస్ చేయగల ప్లాంటు కృష్ణపట్నం వద్ద ఉంది. రూ.120 కోట్లు వెచ్చించాం. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై రూ.10 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. తమిళనాడులోని నాగపట్నం వద్ద రోజుకు 400 టన్నుల సామర్థ్యంగల ప్లాంటును రూ.36 కోట్లతో కొనుగోలు చేశాం. జూన్ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.