జియోనీ ఎఫ్‌ 9 ప్లస్‌ : అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ధర

Gionee F9 Plus with 4 050mAh battery launched - Sakshi

సాక్షి, ముంబై: మొబైల్‌ సంస్థ జియోనీ  ఎఫ్ 9 ప్లస్  పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో  లాంచ్‌ చేసింది.  భారీ డిస్‌ప్లే, బ్యాటరీ, డ్యుయల్‌ రియర్‌ కెమెరాలాంటి  అద్భుత ఫీచర్లతో ఈ డివైస్‌ను  తీసుకొచ్చింది.  6.26-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్‌ప్లే,  వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫీచర్‌తో  తీసుకొచ్చింది.
ధర:  రూ.7690 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది.

జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు
6.26 ఇంచ్ డిస్‌ప్లే
1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0 పై
 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
 4050 ఎంఏహెచ్ బ్యాటరీ 

వినియోగదారుల  మారుతున్న ప్రాధాన్యతలతో బ్రాండ్లు అభివృద్ధి చెందాలి ,సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న ధోరణులకనుగుణంగా ఉత్పత్తులు ఉండాలి. ముఖ్యంగా కస్టమర్ల స్పష్టమైన అభిరుచిని చేరుకునేందుకు జియోనీ ఎల్లపుడూ ప్రయత్నిస్తుందని  కంపెనీ  మేనేజింగ్ డైరెక్టర్   ప్రదీప్‌ జైన్  తెలిపారు. అంతేకాదు ఈ  స్మార్ట్‌ఫోన్‌తో పాటు, జియోనీ ‘జీబడ్డీ’ పేరుతో కొత్త సబ్ బ్రాండ్‌ను కూడా ప్రకటించింది. ఈ  బ్రాండ్‌ కింద వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ హెడ్‌సెట్, ఇయర్‌ఫోన్స్ ,  పవర్ బ్యాంక్‌లను ఆవిష్కరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top