జియోపై జీహెచ్ఎంసీ ఫిర్యాదు | GHMC files a compliant against L&T, Jio | Sakshi
Sakshi News home page

జియోపై జీహెచ్ఎంసీ ఫిర్యాదు

Jun 8 2017 1:58 PM | Updated on Sep 5 2017 1:07 PM

జియోపై జీహెచ్ఎంసీ ఫిర్యాదు

జియోపై జీహెచ్ఎంసీ ఫిర్యాదు

హైదరాబాద్ లో రాత్రి కురిసిన కుండపోత వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొన్నారు.

హైదరాబాద్ లో రాత్రి కురిసిన కుండపోత వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొన్నారు. ఎల్ అండ్ టీ, జియోలు గతకొంతకాలంగా తవ్వుతున్న గుంతలపై నేడు కేసు నమోదుచేశారు. యూసఫ్ గూడలో గుంతలు తవ్వ వదిలేశారంటూ జూబ్లిహిల్స్ పీఎస్ లో తమ ఫిర్యాదును దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని అనవసరంగా డ్యామేజ్ చేశారంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల క్వార్టర్స్ నుంచి యూసఫ్ గూడ వెళ్లే దారిలో మెట్రో పిల్లర్ల కోసం ఎల్ అండ్ టీ గుంతలు తీసింది.
 
వారి పనులు పూర్తయినా వాటిని పూడ్చలేదు. అంతేకాక ఇటు జియో సైతం తమ టవర్ల కోసం గుంతలు తవ్వింది. గత రాత్రి కురిసిన వర్షానికి ఈ గుంతలన్నీ నీరు నిండిపోయాయి. నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.. నాలాల్లో నిండిన చెత్త  వీరి పనులకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement