రిలయన్స్‌ బోర్డులోకి మాజీ సీవీసీ

Former tax dept head K V Chowdary joins Reliance board         - Sakshi

సాక్షి, ముంబై:  బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్‌ ఇండస్ట్రీస్ బోర్డులోకి  అవినీతి నిరోధక శాఖ  మాజీ అధి​కారి కేవీ  చౌదరి చేరారు.  ఈ మేరకు రిలయన్స్‌  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం అందించింది.  శుక్రవారం జరిగిన బోర్డు  సమావేశంలో చౌదరిని  నాన్ ఎగ్జిక్యూటివ్‌ అదనపు డైరెక్టర్ గా నియమకానికి ఆమెదం లభించినట్టు తెలిపింది. అలాగే ఆయన బాధ్యతలు సంస్థలో  ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం లేదని పేర్కొంది. 

మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి . 1978-బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) బ్యాచ్‌కు  చెందినవారు. కేవీ చౌదరి ఆగస్టు 2014 లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) ఛైర్మన్‌గా  బాధ‍్యలను నిర్వహించారు. ఆ తరువాత, సమస్యలపై రెవెన్యూ శాఖకు సలహాదారుగాను, జూన్ 2015నుంచి 2019 జూన్‌ వరకు  సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) గాను పనిచేశారు.  కాగా సీవీసీగా అతని నాలుగేళ్ల పదవీకాలంలో, ముఖ్యంగా 2018 లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అంతర్గత పోరును పరిష్కరించే క్రమంలో కేవీ చౌదరి వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top