
విమాన, బస్ ప్రయాణీకులకు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన ఫ్లిప్‌కార్ట్
న్యూయార్క్ : క్రిస్‌మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విమాన, బస్ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ విమానాలపై రూ 1000, అంతర్జాతీయ విమానాలపై 12 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసింది. వీటికితోడు హోటల్ బుకింగ్స్‌పై 50 శాతం తగ్గింపును ఆఫర్ చేసింది. ఇక బస్ ప్రయాణీకులకూ ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. బస్ టికెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది.
మరోవైపు ఈ ఆఫర్లను ఉపయోగించుకునేందుకు ఎలాంటి కూపన్ కోడ్‌ను వాడాల్సిన పనిలేదు. ఫ్లిప్‌కార్ట్ తాజా ఆండ్రాయిడ్ యాప్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్‌లోనూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ఇండిగో న్యూ ఇయర్ సేల్‌కు ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయ విమాన టికెట్లను రూ 3239 రూపాయల నుంచి ఇండిగో ఆఫర్ చేస్తోంది.