ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌, ఆఫర్లు

Flipkart Big Shopping Days Sale 2019 Announced  - Sakshi

సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించింది. బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ -2019 లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లు , ఇతర ఆఫర్‌లను అందించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 ఆదివారం నుండి ప్రారంభమయ్యే డిసెంబర్ 5 వరకు ఐదు రోజుల పాటుకొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నవంబర్ 30, శనివారం రాత్రి 8 గంటల నుండే కొనుగోళ్లకు ముందస్తు అనుమతి లభిస్తుంది.

ముఖ్యంగా రియల్‌మి, శాంసంగ్‌ గెలాకసీ, ఆపిల్‌ ఐ ఫోన్లపై ఆఫర్లను తీసుకొస్తోంది. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 80 శాతం తగ్గింపు లభ్యం. డిఎస్‌ఎల్‌ఆర్‌, డిజిటల్ కెమెరాలపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్. దీంతోపాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. ప్రధానంగా బిగ్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ "బ్లాక్ బస్టర్ డీల్స్"  కూడా అందించనుంది. ఉదయం 12, 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అదేవిధంగా తెల్లవారుజామున 2 గంటలకు "రష్ అవర్స్" లో స్పెషల్‌ సేల్‌ నిర్వహించనుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో ప్రధానంగా రియల్‌మి 5, రియల్‌మే ఎక్స్, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 9, గెలాక్సీ ఎస్ 9 ప్లస్‌, గూగుల్ పిక్సెల్ 3 ఎ, ఆపిల్ ఐఫోన్ 7, ఆసుస్ 5 జెడ్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపును అందించనుంది.

మొబైల్ ఫోన్లపై ఆఫర్లు
రియల్‌మి5 :  అసలు ధర రూ. 9,999 డిస్కౌంట్ ధర రూ. 8,999
రియల్‌మి ఎక్స్: అసలు ధర రూ. 16,999 ఆఫర్‌ ధర రూ. 15,999
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 9 : అసలు ధర రూ. 29,999 డిస్కౌంట్ ధర రూ. 27,999
గెలాక్సీ ఎస్ 9 ప్లస్‌ : అసలు ధర రూ. 37,999 డిస్కౌంట్ ధర రూ. 34,999
గూగుల్ పిక్సెల్ 3 ఎ :  అసలు ధర రూ. 34,999 ఆఫర్‌ ధర రూ. 29,999
ఆపిల్ ఐఫోన్ 7: అసలు ధర రూ. 27,999 ఆఫర్‌ ధర రూ. 24,999
ఆసుస్ 5 జెడ్ :  అసలు ధర రూ. 16,999 ఆఫర్‌ ధర రూ. 15,999

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top