ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ. 210 కోట్లు | Federal Bank Q1 below estimates at Rs 210 cr; asset quality deteriorates | Sakshi
Sakshi News home page

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ. 210 కోట్లు

Jul 27 2017 12:39 AM | Updated on Sep 5 2017 4:56 PM

పెట్టుబడులపై మంచి రాబడులు, వడ్డీ ఆదాయం పెరుగుదల ఊతంతో ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన

న్యూఢిల్లీ: పెట్టుబడులపై మంచి రాబడులు, వడ్డీ ఆదాయం పెరుగుదల ఊతంతో ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.210 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 167 కోట్లతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి. క్యూ1లో బ్యాంకు ఆదాయం రూ. 2,264 కోట్ల నుంచి రూ. 2,653 కోట్లకు పెరిగింది. ఇక, జూన్‌ త్రైమాసికంలో  స్థూల నిరర్ధక ఆస్తులు(జీఎన్‌పీఏ) 2.92% నుంచి 2.42%కి, నికర ఎన్‌పీఏలు 1.68% నుంచి 1.39%కి తగ్గాయి. బుధవారం బీఎస్‌ఈలో ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు సుమారు 4% క్షీణించి రూ. 114.80 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement