58 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాలు ఔట్‌, ఎందుకు? | Facebook goes after fake accounts, axes 583 million profiles in 3 months | Sakshi
Sakshi News home page

58 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాలు ఔట్‌, ఎందుకు?

May 16 2018 10:14 AM | Updated on Jul 26 2018 5:23 PM

Facebook goes after fake accounts, axes 583 million profiles in 3 months - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో:  డేటా లీక్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ ఎత్తున ఫేక్‌ అకౌంట్లను తొలగించింది. కేవలం మూడు నెలల్లోనే  ఈ ఖాతాలకు  చెక్‌ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో  58.3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు తెలిపింది.  అంతేకాదు  ఫేస్‌బుక్‌లో లక్షలాది నకిలీ ఖాతాలను రూపొందించే  పయత్నాలను నిరోధిస్తున్నామని వెల్లడించింది. భారీ  ఎత్తున డేటా బ్రీచ్‌ ఆరోపణలతో  యూజర్ల  గోప్యత ప్రశ్నార్థకంగా మారడంతో తన ఫ్లాట్‌పాంలో సెక్యూరిటీ అంశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా నకిలీ అకౌంట్లను ఏరివేసేందుకు సన్నద్ధమైంది.  యూజర్ డేటా దుర్వినియోగం విచారణలో భాగంగా తమ ప్లాట్‌ఫాంపై దాదాపు  200 యాప్స్‌ను తొలగించినట్టు  ప్రకటించిన ఫేస్‌బుక్‌  తాజాగా   ఈ చర్య తీసుకోవడం విశేషం

2018 మొదటి మూడునెలల్లో 583 మిలియన్ల నకిలీ ఖాతాలను రద్దు చేసింది. ఈ మేరకు  ఫేస్‌బుక్‌  మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది.  లైంగిక వేధింపులు, హింసాత్మక చిత్రాలు, తీవ్రవాద ప్రచారాలు లేదా ద్వేషపూరిత ప్రసంగం  లాంటి కమ్యూనిటీ ప్రమాణాలను దృష్టిలోవుంచుకుని ఆయా ఖాతాలను డిలిట్‌ చేసినట్టు వెల్లడించింది. దీంతోపాటు  837 మిలియన్ల పోస్టులను తొలగించామని వివరించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా  బ్రీచ్‌ కుంభకోణం తరువాత  ఫేస్‌బుక్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ  నకిలీ ఖాతాలను  నిరోధిస్తున్నట్టు చెప్పింది. అయినప్పటికీ  నకిలీ ప్రొఫైల్స్  బెడద భారీగా ఉందని చెప్పింది. ఇది యాక్టివ్‌ అకౌంట్లను 3-4 శాతం  ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement