పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త

Published Thu, Jun 22 2017 7:48 PM

పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త

న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)  ఖాతాదారులకు శుభవార్త అందించింది.  పీఎఫ్‌ ఖాతాదారులకు క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడి పథకాన్ని అందుబాటులోకి  తెచ్చేలా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)తో ఒక ఒప్పందం కుదుర్చుకోనుంది.  ఈ మేరకు గురువారం ఒక అంగీకారానికి వచ్చింది. తద్వారా  ఇ.పి.ఎఫ్.ఒ. తన చందాదారుల కోసం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏఐ) ద్వారా ప్రవేశపెట్టిన హౌసింగ్ పథకం  ప్రయోజనాలను మౌలీకృతం చేస్తుంది. పిఎంఏ పరిధిలో సరసమైన గృహాలను కొనుగోలు చేసేందుకు రూ. 2.67 లక్షల  వరకు సబ్సిడీని  సభ్యులకు అందించనుంది.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ, వడ్డీ సబ్సిడీని పొందేందుకు గృహనిర్మాణ, పట్టణ అభివృద్ధి సంస్థతో ఇపిఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2022 నాటికి అందరికీ  ఇల్లు అనే   కేంద్ర ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా  ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుందని ఒక అధికారిక ప్రకటనలో ఈపీఎఫ్‌వో తెలిపింది.  హడ్కోతో  కుదుర్చుకున్న ఈ ఒప్పదం ప్రకారం రూ. 2.67 లక్షల  వరకు గృహ సబ్సిడీ   ఇపిఎఫ్ సభ్యులు పొందుతారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్, హడ్కో సీఎండీ ఎం.రవి కంత్లు  ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు.  కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ  ఒప్పందం జరగనుంది.

ఇపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్ ఈ ఒప్పందంపై  మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇపిఎఫ్ఓ చందాదారులకు  ఇళ్లు కొనుగోలు చేయడానికి చౌకైన రుణాలు  వంటి వివిధ ప్రయోజనాలను అందించనున్నట్టు చెప్పారు.
 

Advertisement
Advertisement