కోటి 50లక్షల ఉద్యోగాలు: ఆర్థిక సర్వే | Economic Survey 2018 LIVE: Realty, construction sectors to offer 15 mn jobs in 5 yrs | Sakshi
Sakshi News home page

కోటి 50లక్షల ఉద్యోగాలు: ఆర్థిక సర్వే

Jan 29 2018 7:24 PM | Updated on Mar 19 2019 6:19 PM

Economic Survey 2018 LIVE: Realty, construction sectors to offer 15 mn jobs in 5 yrs - Sakshi

ఆర్ధిక సర్వే-2018: ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌

సాక్షి, న్యూఢిల్లీ:  మినీ బడ్జెట్‌గా భావించే 2017 ఆర్థిక సర్వేలో ఉద్యోగాల  కల్పనపై కీలక  సూచనలు అందించింది ప్రభుత్వం.  దేశ ఆర్థిక వ్యవస్థ  పుంజుంకుంటోందన్న     ప్రధాన  ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ‍్రమణియన్‌ ఉద్యోగఅవకాశాలపై మరో ఆసక్తికరమైన అంచనాలను అందించారు.  2019  సంవత్సరానికి జీడీపీ వృద్ధి  7-7.5 శాతంగా ఉంటుందని అంచనా వేయడంతోపాటు  రాబోయే అయిదేళ్లలో భారీ  ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు.  రియల్టీ, నిర్మాణ రంగంలో రాబోయే అయిదేళ్లలో 1.5కోట్ల ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆర్థిక సర్వే నివేదించింది. 

గత  కొన్ని క్వార్టర్లుగా  ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రెండు రంగాలు దేశంలోనే రెండవ అతిపెద్ద ఉద్యోగాలిచ్చే సెక్టార్లుగా నిలవనున్నాయని తెలిపింది. రియల్టీ, నిర్మాణ రంగంలో   2013లో 40మిలియన్ల మందికి, 2017లో 52 మిలియన్ల మందికి ఉపాధి అవకాశం లభించగా,  2022 నాటికి దాదాపు 67 మిలియన్ల మందికి ఉపాధి  లభించనుందని  ఆర్థిక సర్వే అంచనా వేసింది.

కాగా  గత ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1కి మార్చిన కేంద్ర ప్రభుత్వం  ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత‍్వంలో వస్తున్నఈ బడ్జెట్‌ఫై ఈ సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు.  ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దీంతో అంచనాలు భారీగా  ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement