లక్ష ఈ-కామర్స్ కొలువులు! | E-commerce biz may need to hire 1 lakh people in next 6 months | Sakshi
Sakshi News home page

లక్ష ఈ-కామర్స్ కొలువులు!

Jan 26 2015 1:38 AM | Updated on Sep 2 2017 8:15 PM

లక్ష ఈ-కామర్స్ కొలువులు!

లక్ష ఈ-కామర్స్ కొలువులు!

ఆన్‌లైన్ షాపింగ్ పరిశ్రమలో కొలువుల జోరు పెరగనుంది. ఈ-కామర్స్ మార్కెట్‌కు వచ్చే ఆరు నెలల్లో లక్ష కొత్త ఉద్యోగాల అవసరం ఉందనేది పరిశ్రమ వర్గాల అంచనా.

వచ్చే ఆరునెలల్లో నియామకాలపై పరిశ్రమల వర్గాల అంచనా
ముంబై:  ఆన్‌లైన్ షాపింగ్ పరిశ్రమలో కొలువుల జోరు పెరగనుంది. ఈ-కామర్స్ మార్కెట్‌కు వచ్చే ఆరు నెలల్లో లక్ష కొత్త ఉద్యోగాల అవసరం ఉందనేది పరిశ్రమ వర్గాల అంచనా. నియామకాలకు సంబంధించిన కన్సల్టెంగ్ సంస్థలకు ఈ-కామర్స్ నుంచి హైరింగ్ విజ్ఞప్తులు భారీగా పెరుగుతున్నాయని గ్లోబల్ హెర్‌ఆర్ దిగ్గజం ఇన్‌హెల్మ్ లీడర్షిప్ సొల్యూషన్స్ కంట్రీ హెడ్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. రానున్న ఆరు నెలల వ్యవధిలో కనీసం లక్ష కొత్త ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
 
* 2009లో దేశీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లు ఉండగా... 2013లో ఇది 12.6 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. చక్రీయగతిన(సీఏజీఆర్) 30% వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి 8-10 శాతం స్థాయిలో ఉంది.
* అయితే, కీలక స్థానాల్లో నిపుణులను అట్టిపెట్టుకోవడం దేశీ ఈ-కామర్స్ రంగానికి అతిపెద్ద సవాలు.
* కంపెనీలు భారీ స్థాయిలో విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తుండటంతో.. సిబ్బంది అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో నియామకాల కోసం ఈ రంగంలో నైపుణ్యంగల కన్సల్టెన్సీలపై అధికంగా ఆధారపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement