టాటా సన్స్‌పై డొకొమో దావా

టాటా సన్స్‌పై డొకొమో దావా


న్యూఢిల్లీ/టోక్యో: జపాన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎన్‌టీటీ డొకొమో టాటా సన్స్‌ను ఆర్బిట్రేషన్ కోర్టుకు లాగింది. టాటా టెలిసర్వీసెస్‌తో తాము ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌లో వాటా కొనుగోలు విషయంలో టాటా సన్స్  విఫలమైందనేది ఎన్‌టీటీ డొకొమో వాదన. ఈ నెల 3న లండన్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో టాటా సన్స్‌కు వ్యతిరేకంగా డొకొమో ఈ దావా దాఖలు చేసింది.



వివరాలివీ... టాటా డొకొమోతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌లో తమకున్న 26.5 శాతం (రూ.7,250 కోట్ల విలువ) వాటాను విక్రయించడం ద్వారా ఆ జేవీ నుంచి వైదొలగనున్నామని ఎన్‌టీటీ డొకొమో గత ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. ఆ జేవీలో భాగస్వామిగా ఉన్న టాటా సన్స్ ఆ వాటాను కొనుగోలు చేస్తుందని పేర్కొంది.



అయితే ఇరువైపులా తలెత్తిన కొన్ని విభేదాల కారణంగా ఈ డీల్ సాకారం కాలేదు.  ఈ డీల్ విషయమై టాటా సన్స్‌తో పదే పదే సంప్రదింపులకు ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ టాటా సన్స్ విఫలమైందని డొకొమో తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ డీల్ సాకారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశామని టాటా సన్స్ ప్రతినిధి చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top