జీఎస్‌టీ తగ్గింపుపై త్వరలో నిర్ణయం

Decision Soon on Low GST - Sakshi

ఈ విషయమై రాష్ట్రాలతో

సంప్రదింపులు: మంత్రి గడ్కరీ

వాహన సంస్థలకు హామీ...

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగానికి జీఎస్‌టీ తగ్గింపు విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం జీఎస్‌టీ మండలికే ఉంటుందని తెలిసిందే. ‘‘రాష్ట్రాలతో ఆరి్థక శాఖ చేస్తున్న సంప్రదింపులపై నేను నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ సాధ్యపడితే వారు ఓ నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో  మంత్రి మాట్లాడారు. 

ప్రమాదాల నివారణకే అధిక జరిమానాలు
ట్రాఫిక్‌ జరిమానాలను భారీగా పెంచడాన్ని గడ్కరీ సమర్థించుకున్నారు. 30 ఏళ్ల తర్వాత జరిమానాలను పెంచినట్టు గుర్తు చేశారు. అధిక జరిమానాలు రోడ్డు ప్రమాదాలను నివారించంతోపాటు రహదారి భద్రతను ప్రోత్సహిస్తాయన్నారు. ఆదాయ పెంపు కంటే ప్రాణాలను కాపాడటానికే జరిమానాలను పెంచినట్టు వివరణ ఇచ్చారు. ఈ విషయమై సానుకూల స్పందన వచి్చనట్టు చెప్పారు.  రాష్ట్రాలు కావాలనుకుంటే జరిమానాలను తగ్గించుకోవచ్చని సూచించారు.

బీఎస్‌–6 ప్రమాణాలతో ‘యాక్టివా 125’ విడుదల
ధరల శ్రేణి రూ. 67,490 – 74,490

న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తన బెస్ట్‌ సెల్లింగ్‌ స్కూటర్‌ ‘యాక్టివా 125’లో భారత్‌ స్టేజ్‌–6 (బీఎస్‌6) ప్రమాణాలతో కూడిన అధునాతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే కంపెనీలు విడుదలచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజా వాహనాన్ని హోండా విడుదల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచి్చన ఈ నూతన స్కూటర్‌ ధరల శ్రేణి రూ. 67,490 – రూ. 74,490 (ఎక్స్‌–షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇందులో 124సీసీ, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చింది. ఈనెల చివరికి వినియోగదారులకు చేరనుందని ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top