నమ్మకానికి మారు పేరు భారతి సిమెంట్‌

Dealers Helped in Development of Bharti Cement says Mallareddy - Sakshi

డీలర్స్‌ సమావేశంలో మల్లారెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): నమ్మకానికి మారుపేరుగా ఉన్న భారతి సిమెంట్‌ అభివృద్ధికి డీలర్స్‌ ఎంతో సహాయపడ్డారని మార్కెటింగ్‌ వైస్‌ చైర్మన్‌ సీహెచ్‌ మాల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని మినర్వాగ్రాండ్‌లో భారతి సిమెంట్‌ డీలర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్‌ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్‌ఫ్రూప్‌ ప్యాకింగ్, జర్మన్‌ టెక్నాలజీ వంటి వాటితో భారతి సిమెంట్‌  వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందన్నారు. ఇటీవలే ఆవిష్కరించిన నూతన ప్రొడక్ట్‌ భారతీ అల్ట్రా ఫాస్ట్‌ చాలా వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. ఎక్కువ బలం, ధృడమైన ఇళ్ల నిర్మాణానికి ఈ సిమెంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ చీఫ్‌ మేనేజర్‌ సీ ఓబుల్‌రెడ్డి, టెక్నికల్‌ ఆఫీసర్‌ ఛాయపతి, మార్కెటింగ్‌ మేనేజర్స్‌ విజయవర్దన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కృపరాజు, డీలర్స్‌పాల్గొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top