డిసెంబర్‌ 31 వరకూ ఆధార్‌–పాన్‌ అనుసంధానం!! | Deadline for linking Aadhaar and PAN extended to December 31 | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 31 వరకూ ఆధార్‌–పాన్‌ అనుసంధానం!!

Sep 1 2017 12:14 AM | Updated on Aug 20 2018 9:18 PM

డిసెంబర్‌ 31 వరకూ ఆధార్‌–పాన్‌ అనుసంధానం!! - Sakshi

డిసెంబర్‌ 31 వరకూ ఆధార్‌–పాన్‌ అనుసంధానం!!

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌–పాన్‌ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్‌ 31 వరకు ఆధార్, పాన్‌ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌–పాన్‌ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్‌ 31 వరకు ఆధార్, పాన్‌ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు. ‘పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా పాన్‌తో ఆధార్‌ అనుసంధాన గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే సెప్టెంబర్‌ 30 వరకు రిటర్న్స్‌ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు, ఆడిట్‌ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్‌ 31 వరకు గడువునిచ్చిందని తెలిపింది. కాగా పన్ను చెల్లింపుదారులు వారి పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు గురువారం (ఆగస్ట్‌ 31)తో ముగిసింది.

ఆధార్‌కు సంబంధించిన కేంద్ర నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కోర్టు నవంబర్‌లో విచారించనుంది. అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు ఆధార్‌ తప్పనిసరని ప్రభుత్వం ఇదివరకే పేర్కొంది. ఆధార్‌లేని వారు సెప్టెంబర్‌ 30లోపు ఆధార్‌ పొందాలని తెలిపింది. అయితే ఈ గడువును తాజాగా డిసెంబర్‌ చివరకు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే పాన్, ఆధార్‌ అనుసంధాన గడువునూ పొడిగించిం ది. ఇక ప్రజలు డిసెంబర్‌ చివరి వరకు ఆధార్‌ను బ్యాంక్‌ ఖాతాలతో లింక్‌ చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement