నిజాయితీయే మా విజయ రహస్యం: అమెజాన్‌ | Customer Trust Important Says Amazon India | Sakshi
Sakshi News home page

నిజాయితీయే మా విజయ రహస్యం: అమెజాన్‌

May 21 2020 9:52 PM | Updated on May 21 2020 9:56 PM

Customer Trust Important Says Amazon India - Sakshi

ముంబై: కరోనా దెబ్బకు ఈ కామర్స్‌ కంపెనీలు భారీగా కుదేలయ్యాయి. నష్టాలను పూడ్చుకునేందుకు ఈకామర్స్‌ కంపెనీలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. వినియోగిదారులను ఆకర్శించేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా ఊపయోగిస్తామని అమెజాన్ ఇండియా పేర్కొంది. వినియోగదారులను ఆన్‌లైన్‌ సేవలకు మొగ్గు చూపే విధంగా ఈకామర్స్‌ కంపెనీలు కృషి చేస్తున్నాయి. నిజాయితిగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలకు ఎప్పటికి భవిష్యత్తు ఉంటుందని అమెజాన్‌ కంపెనీ ప్రతినిథులు తెలిపారు. నిజాయితియే తమ విజయ రహస్యమని అమెజాన్ కంపెనీ ప్రకటించింది. 

కరోనా తగ్గుదల తర్వాత వినియోగదారులు రక్షణాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని.. కంపెనీలు మెరుగైన సేవలు అందించేందుకు తీవ్రంగా కృషి చేయాలని అమెజాన్‌ ఇండియా ముఖ్య ప్రతినిథి అమిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.  రానున్న కాలంలో సాంకేతికత, నూతన ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement