కరోనా ప్రభావమే ఎక్కువ..

CREDAI Seeks Urgent Support For Realty Sector in Letter to MODI - Sakshi

రియల్టీ రంగానికి రూ. 25 వేల కోట్లు కేటాయించాలి

రుణ పునర్‌వ్యవస్థీకరణ, వడ్డీ రేట్లను తగ్గించాలి

ప్రధాని మోదీకి క్రెడాయ్‌ లేఖ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలిపింది. కరోనా కంటే ముందు నుంచే ప్రతికూలంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మరింత ముంచేసిందని పేర్కొంది. తీవ్రంగా నష్టపోయిన రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని రుణ పునర్‌వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో ఆదుకోవాలని ఈ మేరకు క్రెడాయ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

అర్ధంతరంగా నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి తక్షణమే రూ.25 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని లేఖలో కోరింది.‘‘వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాలు కల్పించేది రియల్టీ రంగమేనని, స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లోనూ రియల్టీకి సింహ భాగం వాటా ఉందని, అలాంటి రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రియల్టీ మీద ఆధారపడి సిమెంట్, స్టీల్, రంగుల వంటి సుమారు 250 అనుబంధ రంగాలున్నాయని’’ లేఖలో సభ్యులు పేర్కొన్నారు. నగదు లభ్యత, ఇసుక, స్టీల్, సిమెంట్‌ వంటి నిర్మాణ సామగ్రి కొరత వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయని చెప్పారు.

లేఖలోని ప్రధానాంశాలివే..
► 2008లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఎలాగైతే వన్‌టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌ స్కీమ్‌ అమలు చేసిందో.. అలాగే ఇప్పుడు కూడా తీసుకురావాలని, అన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు అమలు చేయాలి. 2019 డిసెంబర్‌ 31 నాటికి ఉన్న అన్ని రియల్టీ రుణ ఖాతాలను పునర్‌వ్యవస్థీకరించాలి.

► అన్ని బ్యాంకులు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనా న్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) ఎలాంటి అదనపు సెక్యూరిటీ లేకుండా  ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్‌లలో 20 శాతానికి సమానమైన అదనపు రుణాన్ని అందించాలి. అలాగే సంబంధిత ప్రాజెక్ట్‌ను ఎన్‌పీఏగా పరిగణించకూడదు.

► కరోనా ప్రభావం తగ్గేవరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జరిమానాల మీద వసూలు చేసే వడ్డీలను ఏడాది పాటు నిలిపివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉన్న నివాస ఆస్తులకు మూలధన లాభాల పన్ను ఉండకూడదు.

► గృహ నిర్మాణ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి కొత్త గృహాల మీద వడ్డీ రేటును గరిష్టంగా 5%కి తగ్గించాలి. అలాగే నెలవారీ వాయిదా (ఈఎంఐ) వడ్డీ రాయితీని మరొక ఐదేళ్ల పాటు పొడిగించాలి. సెక్షన్‌–24 కింద గృహ రుణం మీద వడ్డీ మినహాయింపును రూ.10 లక్షలకు పెంచాలి.

► నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో కొనుగోలుదారుల తరుఫున డెవలపర్లు చెల్లించే ఈఎంఐ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ను తిరిగి ప్రారంభించాలని ఎన్‌హెచ్‌బీ, ఆర్‌బీఐలను కోరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-07-2020
Jul 07, 2020, 02:47 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో రష్యాను దాటేసి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది....
07-07-2020
Jul 07, 2020, 02:24 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ 1,800 వరకు కేసులు రికార్డు అవుతున్నాయి. ఈ...
07-07-2020
Jul 07, 2020, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సోమవారం కరోనాతో 11 మంది మృత్యువాతపడగా.. మొత్తం...
07-07-2020
Jul 07, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: పీజీ, డిగ్రీలు చేసి చిన్నాచితకా ఉద్యో గాలతో నెట్టుకొస్తున్న లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాల యువతను...
06-07-2020
Jul 06, 2020, 19:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ జర్నలిస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వర్తిస్తున్న...
06-07-2020
Jul 06, 2020, 18:39 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు...
06-07-2020
Jul 06, 2020, 18:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఒక్క ఫోన్‌ కాల్‌ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి...
06-07-2020
Jul 06, 2020, 17:44 IST
ఇంపాల్‌: కరోనా వచ్చిన నాటి నుంచి మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. బంధువులు లేరు.. వేడుకలు లేవు. ఎక్కడికైనా...
06-07-2020
Jul 06, 2020, 17:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప‍్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ  దేశీయ ఫార్మా సంస్థ  మైలాన్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ...
06-07-2020
Jul 06, 2020, 16:58 IST
ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందన్నారు
06-07-2020
Jul 06, 2020, 16:39 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ...
06-07-2020
Jul 06, 2020, 16:18 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల...
06-07-2020
Jul 06, 2020, 15:26 IST
ముంబై: క‌రోనా భూతంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహన క‌ల్పించేందుకు పోలీసులు వారి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆధార‌ప‌డే...
06-07-2020
Jul 06, 2020, 14:33 IST
మీరట్‌ : ‘క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్ వ‌స్తుందా నెగిటివ్ వ‌స్తుందా అని భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.. క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ దాన్ని లేకుండా చేయ‌గ‌లం.....
06-07-2020
Jul 06, 2020, 14:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ల సంఖ్య లక్ష దాటినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం...
06-07-2020
Jul 06, 2020, 12:49 IST
నెల్లూరు(బారకాసు): ఫొటో, వీడియో ఆల్బమ్‌.. ప్రతిఒక్కరి జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మధురమైన జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటారు. పుట్టినప్పటి నుంచి...
06-07-2020
Jul 06, 2020, 12:44 IST
పారిస్‌: మహమ్మారి కరోనా బారినపడి కోలుకుంటున్నవారికి ఓ చేదు వార్త. వైరస్‌ను జయించినవారిలో కొందరు అతిముఖ్యమైన వాసన గ్రహించే సామర్థ్యాన్ని...
06-07-2020
Jul 06, 2020, 12:43 IST
ప్రకాశం, సింగరాయకొండ: కరోనా...అయినవారందరూ ఉన్నా దిక్కులేని వారిని చేస్తోంది. కుటుంబంలో అందరికీ కరోనా సోకి ఆస్పత్రికి వెళ్తే.. ఓ వృద్ధురాలు...
06-07-2020
Jul 06, 2020, 11:55 IST
సిడ్నీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని కట్టడి...
06-07-2020
Jul 06, 2020, 10:52 IST
కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లో  అత్య‌ధికంగా ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 895 కొత్త క‌రోనా కేసులు న‌మోదుకాగా 21 మంది...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top