రంగులే కీలకం

colors are important in childerns room - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగుల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాధారణంగా పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేదు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీనితో పాటు ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గత పరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్‌ సైకాలజీ చెబుతోంది.

ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు, ఇక ఆరెంజ్‌ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్‌ ఉంటే బాగుంటుంది. పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లల కంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా దట్టంగా వేయడం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్‌ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్‌ ఆఫ్‌ చేస్తే పిల్లలు కొత్తల్లో బయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే మెటాలిక్‌ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు.  

కంటికి శ్రమ కలిగించని లైటింగ్‌..
లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురుని అందించే ఫ్లోరోసెంట్‌ బల్బులను వాడాలి. లైటింగ్‌ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండానూ, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండానూ ఉండాలి. పిల్లల గది కదా అని తెగ హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. ఈ క్రమంలో వారి అభిరుచులకు ప్రాధాన్యతను ఇస్తూనే ఆకట్టుకొనే విధంగాను రూపొందించాలి.

ఎక్కడి బొమ్మలు అక్కడనే..
ఇంట్లో గోడలకు చిత్రాలను వేలాడదీయడం కూడా ఒక కళే. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అంటూ పెదవి విరుస్తారు. వంట గదిలో తాజా కన్పించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. ఆహార పదార్థాలకు ఉండాల్సిన తాజాదనాన్ని  ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది కూడా. కొందరికి జంతువల చిత్రాలు అంతగా నప్పవు. దీనికి తోడు మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా కొందరికి రుచించవు. అందుకే చిత్రాల ఎంపిక ఆలోచించి తీసుకోవాలి. అదే ముందు గదిలోనయితే ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధు లు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలు వేలాడదీయవచ్చు.

ఇంటి అందం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్‌: ఇంటి గుమ్మం ముందు ఆధునిక కార్పెట్‌ వేస్తే సరిపోదు.. అది ఎంత శుభ్రంగా ఉందో కూడా చూడాలి. లేకపోతే ఇంట్లోకి వచ్చే అతిథుల దృష్టిలో చులకనవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. ఎక్కువ కాలం మన్నే విధంగా కార్పెట్‌ను క్లీన్‌గా ఉంచుకోవడమెలాగో చూడండి.
ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా ఉండటం కోసం ప్రధాన ద్వారం దగ్గర మ్యాట్‌ను ఉపయోగించాలి. పాదరక్షలు ఇంటి బయటే విడిచే  విధంగా ఏర్పాటు చేసుకోవాలి.  
మరకలు పడిన వెంటనే కార్పెట్‌ను వాక్యుమ్‌ క్లీనర్‌తో శుభ్రపరుచుకోవాలి. లేకపోతే మరకలు ఎండిపోయి తొలగించడం కష్టమవుతుంది.  
మరకలను తొలగించడానికి ఉపయోగించే యాసిడ్‌ను ముందుగా పరీక్షించండం మంచిది. కొన్ని రకాల యాసీడ్‌ల వల్ల కార్పెట్‌ రంగు పోయే ప్రమాదం ఉంది.
డిటర్జెంట్, శ్యాంపోలు ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. డిటర్జెంట్‌ ముక్కలు కార్పెట్‌లో ఇరుక్కుపోయే ప్రమాదమూ ఉందండోయ్‌.
హాల్‌లో ఉండే కార్పెట్‌ను నెలకోసారి, పడక గదిలో ఉండే కార్పెట్‌ను ఆరు నెలలకోసారి శుభ్రం చేసుకోవడమ ఉత్తమం.  
స్టీమ్‌ క్లీనింగ్‌తో కూడా కార్పెట్‌ను క్లీన్‌ చేసుకోవచ్చు. అయితే ముందుగా కార్పెట్‌ బాగా తడిగా ఉండకుండా చూసుకోవాలి. స్టీమ్‌ క్లీన్‌ చేసే ముందు బ్రెష్‌ చేయడం కూడా మరవద్దండోయ్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top