క్యూ2లో కాగ్నిజెంట్‌కు తగ్గిన లాభాలు | Cognizant reports fall in Q2 net profit, maintains full year revenue outlook | Sakshi
Sakshi News home page

క్యూ2లో కాగ్నిజెంట్‌కు తగ్గిన లాభాలు

Aug 2 2018 9:01 PM | Updated on Aug 2 2018 10:04 PM

Cognizant reports fall in Q2 net profit, maintains full year revenue outlook - Sakshi

సాక్షి, ముంబై: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌ క్యూ2 లో నికర లాభాల్లో  క్షీణతను నమోదు చేసింది.  జూన్ నెలాఖరుకు ముగిసిన రెండవ త్రైమాసికంలో నికరలాభం 2.97 శాతం తగ్గి 456 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 470 మిలియన్ డాలర్లుగా నమోదయిందని  కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆదాయంలో పుంజుకుంది.  గత ఏడాది ఇదే కాలంలో 3.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే  ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి  9.2 శాతం ఎగిసి 4 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. మూడో త్రైమాసికంలో సంస్థ 4.06 బిలియన్ డాలర్ల నుంచి 4.10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది.  నికర-ఆపరేటింగ్ విదేశీ మారకం నష్టాలు ,రూపాయి విలువ గత సంవత్సరంతో పోల్చితే తమ లాభాలను దెబ్బతీసిందని కాగ్ని జెంట్‌ఫలితాల సందర్భంగా వెల్లడించింది. అయితే వచ్చే ఏడాది ఆదాయంలో మరింత పుంజుకోనుందనే  ధీమాను కంపెనీ సీఈవో   వెలిబుచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement