వంద కోట్లకు చేరువలో టెలిఫోన్ వినియోగదారులు | Close to a hundred million telephone users | Sakshi
Sakshi News home page

వంద కోట్లకు చేరువలో టెలిఫోన్ వినియోగదారులు

Jun 18 2015 12:33 AM | Updated on Sep 3 2017 3:53 AM

దేశంలో టెలిఫోన్ వినియోగదారులు ఏప్రిల్‌లో 99.9 కోట్లకు చేరారని టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో టెలిఫోన్ వినియోగదారులు ఏప్రిల్‌లో 99.9 కోట్లకు చేరారని టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. మార్చిలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 99.6 కోట్లుగా ఉంది. మార్చిలో 57.7 కోట్లుగా ఉన్న పట్టణ ప్రాంత టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఏప్రిల్‌లో 58 కోట్లకు పెరిగింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంత వినియోగదారుల సంఖ్య 41.93 కోట్ల నుంచి 41.95 కోట్లకు చేరింది. వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య 96 కోట్ల నుంచి 97 కోట్లకు పెరిగింది. అదే సమయంలో వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 2.63 కోట్లకు తగ్గింది.

వైర్‌లెస్ సేవల కల్పనలో ప్రైవేట్ ఆపరేటర్ల మార్కెట్ వాటా 92 శాతంగా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వంటి ప్రభుత్వం ఆపరేటర్ల వాటా 8%గా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో వైర్‌లెస్ వినియోగదారుల వృద్ధి అత్యధికంగా ఉంటే కర్నాటకలో మాత్రం వీరి సంఖ్య తగ్గిం ది. వైర్‌లైన్ విభాగంలో బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ మార్కెట్ వాటా 75% ఉంది. ఏప్రిల్‌లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నవారు 31 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 9.9 కోట్ల నుంచి 10 కోట్లకు పెరిగింది.
 
 ఆపరేటర్  ఏప్రిల్‌లో వైర్‌లెస్ వినియోగదారులు
 ఎయిర్‌టెల్       22 కోట్లు
 వోడాఫోన్        18 కోట్లు
 ఐడియా          15 కోట్లు
 రిలయన్స్        10 కోట్లు
 ఎయిర్‌సెల్          8 కోట్లు
 టాటా                6 కోట్లు
 యూనినార్         5 కోట్లు
 సిస్టమా శ్యామ్    90 ల క్షలు
 వీడియోకాన్       70 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement