సెల్‌కాన్‌ ఆర్‌అండ్‌డీ హబ్‌ | Celkon Research Development Hub in Hyderabad | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్‌ ఆర్‌అండ్‌డీ హబ్‌

May 2 2017 12:38 AM | Updated on Sep 4 2018 5:07 PM

సెల్‌కాన్‌ ఆర్‌అండ్‌డీ హబ్‌ - Sakshi

సెల్‌కాన్‌ ఆర్‌అండ్‌డీ హబ్‌

మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్‌... రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొబైల్‌ ఫోన్ల కాన్సెప్ట్‌ మొదలు హార్డ్‌వేర్,

గచ్చిబౌలిలో 20 అంతస్తుల్లో
2018కల్లా హబ్‌ సిద్ధం చేస్తాం
‘సాక్షి’తో సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్‌... రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొబైల్‌ ఫోన్ల కాన్సెప్ట్‌ మొదలు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ వంటి విభాగాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేయాలన్నది కంపెనీ ఆలోచన. గచ్చిబౌలిలో ప్రతిపాదిత మొబైల్‌ ఆర్‌ అండ్‌ డీ హబ్‌లో సెల్‌కాన్‌కు ఒక ఎకరం స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్రం నుంచి పలు ప్రోత్సాహకాలను అందుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళతామని సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు.

 మొబైల్స్‌ తయారీ విషయంలో వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా ఈ హబ్‌ను నిర్మిస్తామని చెప్పారు. కంపెనీలన్నీ ఒకేచోట..: ప్రస్తుతం సెల్‌కాన్‌కు చైనాలోని ఆర్‌ అండ్‌ డీ కేంద్రంలో 100 మంది, బెంగళూరు టెక్నోవేషన్‌ కేంద్రంలో 400 మంది నిపుణులు ఉన్నారు. ఈ రెండు కేంద్రాలను హైదరాబాద్‌కు తరలిస్తారు. సెల్‌కాన్‌తో దాదాపు 20 కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ ఒకే గూటి కిందకు తేవాలన్నది తమ ప్రణాళిక అని గురు వెల్లడించారు. ఆగస్టులో శంకుస్థాపన చేసి, 2018కల్లా 20 అంతస్తుల్లో హబ్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో తొలి కేంద్రం అవుతుందని వివరించారు.

 హబ్‌ నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటుకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కాగా, నెలకు 10 లక్షల మొబైళ్ల తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్న తిరుపతి ప్లాంటును జూన్‌లో ప్రారంభించేందుకు సెల్‌కాన్‌ సిద్ధం అవుతోంది. టెక్నోవేషన్‌ నుంచి..: సెల్‌కాన్‌ త్వరలో క్లిక్‌ అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. బెంగళూరు టెక్నోవేషన్‌ కేంద్రంలో అభివృద్ధి అయిన తొలి ఉత్పాదన ఇది.

 180 డిగ్రీల పనోరమిక్‌ వ్యూలో చిత్రాలను ఈ ఫోన్‌ ద్వారా తీయవచ్చు. జిఫ్‌ ఫైల్‌ మాదిరిగా 3 సెకన్లపాటు వీక్షించగలిగే లైవ్‌ ఫొటో, ఎలాంటి హెడ్‌ సెట్లో అయినా సంగీతం శ్రావ్యంగా వినిపించే కస్టమైజ్డ్‌ మ్యూజిక్‌ ప్లేయర్‌ను జోడించారు. బ్యాటరీ 10%కి రాగానే ఇందులోని సూపర్‌ పవర్‌ సేవర్‌ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్‌ కాస్తా బేసిక్‌ ఫోన్‌గా మారిపోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement