వ్యాపార విశ్వాస సూచీ  9 శాతం అప్‌ 

Business confidence index up 9 percent - Sakshi

ఎన్‌సీఏఈఆర్‌ సర్వే 

న్యూఢిల్లీ: వ్యాపార విశ్వాస సూచీ త్రైమాసికం పరంగా చూస్తే 2017 డిసెంబర్‌ క్వార్టర్‌లో 9.1 శాతం పెరిగింది. మొత్తంగా చూస్తే సెంటిమెంట్‌ జోరుగానే ఉంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ఎన్‌సీఏఈఆర్‌ బిజినెస్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ (ఎన్‌–బీసీఐ) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 12.9 శాతం క్షీణించిన విషయం తెలిసిందే.

ఉత్పత్తి, దేశీ విక్రయాలు, ఎగుమతులు, ముడిపదార్ధాల దిగుమతులు, స్థూల లాభాలు వంటి వాటికి సంబంధించిన సెంటిమెంట్‌ 2017 జూలై–సెప్టెంబర్‌తో పోలిస్తే 2017 అక్టోబర్‌–డిసెంబర్‌లో జోరుగా ఉందని సర్వే పేర్కొంది. సెంటిమెంట్‌ మెరుగుదల వల్ల అన్ని రంగాల్లో వృద్ధి ధోరణులు కనిపిస్తున్నాయని తెలిపింది. కార్మిక ఉపాధి, వేతనాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఇక భవిష్యత్‌ ఉపాధి, వేతనాలకు సంబంధించిన అంచనాలు సానుకూలంగానే ఉన్నాయని తెలిపింది.   

Back to Top