విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతాయ్ | Budget woos foreign investors with tax incentives | Sakshi
Sakshi News home page

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతాయ్

Mar 2 2015 3:08 AM | Updated on Oct 4 2018 5:15 PM

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతాయ్ - Sakshi

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతాయ్

గత ఫిబ్రవరి నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారత్ క్యాపిటల్ మార్కెట్లో రూ. 24,500 కోట్ల నికర పెట్టుబడులు చేశారు.

న్యూఢిల్లీ: గత ఫిబ్రవరి నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారత్ క్యాపిటల్ మార్కెట్లో రూ. 24,500 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. వివాదాస్పద పన్ను అంశామై గార్‌ను కేంద్ర బడ్జెట్లో వాయిదావేయడంతో మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గార్ వాయిదాతో దేశంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడుతుందని, ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి దోహదపడుతుందని రెలిగేర్ ఎం టర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ గోద్వాని చెప్పారు.  

దేశీయ స్టాక్, డెట్ మార్కెట్లలో  ఫిబ్రవరి పెట్టుబడులతో కలిపి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 33,688 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి నెలలో వారు రూ. 11,475 కోట్లు షేర్ మార్కెట్లోనూ, రూ. 13,088 కోట్లు రుణ పత్రాల్లోనూ పెట్టుబడి చేసినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గార్ వాయిదా విదేశీ ఇన్వెస్టర్లకు, మొత్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు పెద్ద అనుకూల ప్రతిపాదన అని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ సందీప్ సిక్కా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement