6 రెట్ల డేటా ఫ్రీ: ప్రత్యర‍్థులకు దడదడే | BSNL to offer 6 times more data to postpaid users | Sakshi
Sakshi News home page

6 రెట్ల డేటా ఫ్రీ: ప్రత్యర‍్థులకు దడదడే

Jun 30 2017 7:49 PM | Updated on Sep 5 2017 2:52 PM

6 రెట్ల డేటా ఫ్రీ: ప్రత్యర‍్థులకు దడదడే

6 రెట్ల డేటా ఫ్రీ: ప్రత్యర‍్థులకు దడదడే

ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రత్యర్థి కంపెనీలకు షాకిచ్చే సంచలన ఆఫర్‌తో ముందుకువచ్చింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ  భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)  ప్రత్యర్థి కంపెనీలు, ప్రయివేటు కంపెనీలకు షాకిచ్చే సంచలన ఆఫర్‌తో ముందుకువచ్చింది.  తన పోస్ట్‌పెయిడ్‌ ఖాతాదారులకు దాదాపు 6 రెట్ల  డేటాను ఆఫర్‌ చేస్తోంది.  జూలై1 నుంచి  ప్రీపెయిడ్ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించింది. తమ కొత్త ప్లాన్స్‌లో ఆరు రెట్ల డేటా  ప్రయోజనాలను అందించనున్నామని  బిఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

రూ.99 ప్లాన్‌లో ఇకపై 250ఎంబీ డేటా ఫ్రీ, ఇంతకు ముందు  ఉచిత డేటా సదుపాయం లేదు.
రూ.225 ప్లాన్‌లో 1 జీబీ  డేటా  ఉచితం. ఇంతకు ముందు ఇది 200 ఎంబీ మాత్రమే.
రూ.799 ప్లాన్‌ లో ఇకపై 3 జీబీ స్థానంలో 10జీబీడేటా అందిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌   కాలింగ్‌ సదుపాయం.

వినియోగదారులకు సరసమైన మరియు సమర్థవంతమైన సేవలను అందించడానికి  తాము కట్టుబడి  ఉన్నామని  సంస్థ డైరెక్టర్‌ ఆర్.కె. మిట్టల్  చెప్పారు. భారత టెలికాం పరిశ్రమలో ప్రస్తుత ధోరణిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement