బీఎస్ఎన్ఎల్ 'రక్షాబంధన్' బంపర్‌ ఆఫర్...

BSNL Rakshabandhan Offer - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది.  ఎప్పటిలాగానే  ఈ ఏడాది కూడా రక్షాబంధన్‌ ఆఫర్‌ను వినియోగదారులకు  అందివ్వనుంది.రేపు (ఆదివారం) రాఖీ పండగ సందర్భంగా 'రక్షాబంధన్‌' స్పెషల్ ఆఫర్‌ను  బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.  ఈ స్పెషల్ ఆఫర్ రేపటి నుంచి అందుబాటులోకి  వస్తుందని సంస్థ  ట్విటర్లో వెల్లడించింది.  ఈ సరికొత్తరీచార్జ్‌పై వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

 రూ.399 రీచార్జ్‌పై   రోజుకు 1 జీబీ డేటా చొప్పున  74 రోజుల పాటు అపరిమిత డేటా ఆఫర్‌ చేస్తోంది. ఇంకా అన్‌లిమిటెడ్‌  వాయిస్ కాల్స్‌ను,  రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తోంది. ఈ 'రక్షాబంధన్' ఆఫర్ దేశమంతటా వర్తిస్తుంది. అన్‌లిమిటెడ్‌ పర్సనలైజ్‌డ్ రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్‌బీటీ)ను ఉచితంగా అందిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top