
బీఎండబ్ల్యూ.. ఎం4 కూపే
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కొత్త కారు, ఎం4 కూపేను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది.
గ్రేటర్ నోయిడా: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కొత్త కారు, ఎం4 కూపేను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 1.21 కోట్లని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్‌సర్ చెప్పారు. దీంతో పాటు ఎం3 సెడాన్‌లో కొత్త వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టామని చెప్పారు. ఎం3 సెడాన్‌లో ఇది ఫిప్త్ జనరేషన్ మోడల్ అని, ధర రూ.1.19 కోట్లని (ఈ రెండు కార్ల ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు.
కొత్తగా అభివృద్ధి చేసిన 6 సిలిండర్ల ఇంజిన్‌తో ఈ కార్లను రూపొదించామని, పూర్తిగా తయారైన కార్ల రూపంలో వీటిని దిగుమతి చేసుకుని విక్రయిస్తామని తెలిపారు. త్వరలోనే హైబ్రిడ్ కారు ఐ8ను కూడా భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 37గా ఉన్న డీలర్షిప్‌లను వచ్చే ఏడాది చివరి కల్లా 50కు పెంచనున్నామని ఆయన వివరించారు.